- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుక్కకాటుతో బాలుడికి తీవ్ర గాయాలు..
దిశ, మేడ్చల్ ప్రతినిధి: షాపుకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడికి గురైన బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్వాల్ కనాజిగూడ ప్రాంతానికి చెందిన తారకరాం, నిఖిత దంపతుల కుమారుడు లోహిత్(4) బుధవారం రాత్రి తన ఇంటి పక్కనే ఉన్న కిరాణం షాపుకు వెళ్లాడు.
ఈ క్రమంలోనే అక్కడే మాటు వేసిన కుక్కలు ఆ బాలుడిని వెంబడించి దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులకు తీసుకెళ్లినా వైద్యం చేయలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో చివరకు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలుడికి వైద్యం చేసినట్లు తెలిపారు. బాలుడి వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు నమోదు చేసుకొని వెళ్లారు. ఈ ఘటనతో స్థానికంగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.