Accident : కూలీలతో వెళుతున్న బొలెరో (ఆటో) బోల్తా..

by Sumithra |
Accident : కూలీలతో వెళుతున్న బొలెరో (ఆటో) బోల్తా..
X

దిశ, అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కొరకు వెళుతున్న కూలీలపైనే విధి వెక్కిరించినట్టుగా బొలెరో ఆటో బోల్తాపడి పలువురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే అయిజకు చెందిన ఆటో ప్రతిరోజు తనగల గ్రామం నుండి వ్యవసాయ కూలీలు ఇటిక్యాల మండలంలో పత్తి తీసేందుకు వెళ్లేవారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8-45 నిమిషాలకు అయిజ మండలంలోని కుర్వపల్లి శివారులో సుమారు 20 మందితో కూడిన ఆటో బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వారిని అంబులెన్స్ లో కర్నూలుకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆటో డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్లడం, పరిమితికి మించిన లోడ్ తో వెళ్లడం వలన వేగం అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా పోలీసుల పర్యవేక్షణ సరిగా లేదని పోలీస్ స్టేషన్ ముందుగా ఇటువంటి వాహనాలు వెలితే చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఇకనైనా ఇటువంటి వాహనాలను పోలీసులు కట్టడి చేయాలని కోరుతున్నాను.

Advertisement

Next Story