విషాదం: పడవ బోల్తా.. నలుగురి మృతి

by Anjali |
విషాదం: పడవ బోల్తా.. నలుగురి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకస్మిక తుఫాను కారణంగా బోటు బోల్తా పడడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఇటలీలోని రెండో అతిపెద్ద సరస్సు అయిన మగ్గియోర్ సరస్సులో ఈ విషాదం చోటు చేసుకుంది. పడవలో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నారు. ఆదివారం సుడిగాలి రావడంతో బోటు సెస్టో క్యాలెండే, అరోనా పట్టణాల మధ్య బోల్తా పడింది. అక్కడే ఉన్న స్థానికులు 20 మందిని రక్షించగా.. ఒకరు గల్లంతయ్యారు. నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. రక్షించిన వారిలో ఐదుగురిని హాస్పటల్‌కు తరలించారు. తప్పిపోయిన వ్యక్తి గురించి రిస్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని స్థానిక మీడియా తెలిపింది.

Next Story

Most Viewed