గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చిన భూ తగాదా..

by Sumithra |
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చిన భూ తగాదా..
X

దిశ, వీణవంక : భూతగాదాలతో రెండు కుటుంబాల మధ్య గొడవ గొడ్డలితో దాడి చేసేవరకు వెళ్ళింది. మండలంలోని శ్రీరాముల పేట గ్రామంలో చుక్కల బుచ్చయ్య , శ్రీనివాస్ ల మధ్య కొన్ని రోజుల నుండి ఇంటి స్థలం కోసం గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే గురువారం బుచ్చయ్య తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో చుక్కల శ్రీనివాస్ బుచ్చయ్యను తలపై గొడ్డలితో నరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. బుచ్చయ్య అల్లుడు శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story