డాన్ చచ్చినా అనుచరుల ఆగడాలు ఆగలే!

by GSrikanth |
డాన్ చచ్చినా అనుచరుల ఆగడాలు ఆగలే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దుండగుల కాల్పుల్లో చనిపోయినా వారి అనుచరుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. సామాన్య ప్రజలను బెందిరిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం యూపీలో కలకలం రేపుతోంది. తాజాగా ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతిక్ అనుచరులు ఓ చాట్ వ్యాపారి వద్ద నుంచి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించడం కలకలం రేపింది. అంతటితో ఆగకుండా డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తూ బుల్లెట్లు పేల్చినట్లు బాధితులు చెప్పడం సంచలనంగా మారింది.

ఇదంతా గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ఇంటికి కొన్ని అడుగుల దూరంలో జరిగినట్లు తెలుస్తోంది. అతిక్ అనుచరులలో ఒకరైన నబీ అహ్మద్ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చాట్ వ్యాపారి రాకేష్ తెలిపాడు. గత నెల రోజులుగా డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయాడు. వారి నుండి తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. కాగా గత ఏప్రిల్ లో పోలీసుల అదుపులో ఉండగానే దుండగులు జరిపిన కాల్పుల్లో అతిక్ సోదరులు చంపబడ్డారు.

Advertisement

Next Story