- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో మరో కిడ్నాప్ కలకలం
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్టణం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఘటన మరువకముందే మరో కిడ్నాప్ వెలుగులోకి వచ్చింది. రియల్టర్ శ్రీనివాస్, ఆయన భార్య లక్ష్మిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కిడ్నాప్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రియల్టర్ శ్రీనివాస్ విజయవాడ నుంచి విశాఖపట్టణానికి వచ్చినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌కు గురైన రియల్టర్ శ్రీనివాస్ దంపతుల కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. శ్రీనివాస్ దంపతులను ఎవరు కిడ్నాప్ చేశారు అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలతో కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇకపోతే ఈ నెల 15న విశాఖ ఎంపీ ఎంవీ సత్యనారాయణ భార్య, కొడుకు శరత్ చౌదరి, ఆడిటర్ జీవీని దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ వ్యవహరాన్ని పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కిడ్నాప్ వ్యవహారంలో రౌడీషీటర్ హేమంత్ కీలకపాత్ర పోషించారని సీపీ త్రివిక్రమ్ వర్మ తెలిపిన సంగతి తెలిసిందే.