గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Shiva |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, కొండపాక: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన కుకునూర్ పల్లి మండలం చిన్న కిష్టపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులోని మర్రిశేరికుంటలో గుర్తు తెలియని వ్యక్తి నీటిలో తేలియాడుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుంటలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా ఎసై పుష్ప రాజ్ మాట్లాడుతూ.. మృతుడు సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసు, ఐదు అడుగుల ఎత్తు, ఛామన చాయ రంగు, నలుపు రంగు షార్ట్, నలుపు చోక్క వేసికుని ఉన్నాడని తెలిపారు. ఫోటోలోని మృతదేహాన్ని ఎవరైన గుర్తిస్తే.. డయల్ 100కు లేదా కుకునూర్ పల్లి ఎస్.ఐ ఫోన్ నెం.8712667345 కి సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story