- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మైనర్ బాలికపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారం
దిశ, అమరచింత: నిత్యం మనుషుల మధ్య ఉంటూ క్రూర మృగంలా మారాడు ఓ ఆర్ ఎంపీ వైద్యుడు. అభంశుభం తెలియని ఓ అమాయక మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. అదే జిల్లాలోని ధన్వాడ మండలం ఎంనన్ పల్లి గ్రామానికి చెందిన వివాహితుడైన అబ్దుల్ నబీకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నర్వ మండలంలోని ఓగ్రామంలో గత కొన్ని ఏళ్లుగా జీవనోపాది కోసం క్లినిక్ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ గ్రామంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక పై కన్నేశాడు ఆ ఆర్ఎంపీ. ఆరోగ్య సమస్యలతో క్లినిక్ కు వెళ్లిన సందర్భాల్లో బాలికను మాయమాటలతో మచ్చిక చేసుకున్నాడు. ప్రేమ పేరుతో పెళ్లికూడా చేసుకుంటానని నమ్మించి వశపర్చుకున్నాడు. పేదరికంతో కుటుంబం నెట్టుకొస్తున్నబాలిక తల్లి, భర్త గత ఏడాది అనారోగ్యం కారణంగా మరణించడంతో కుటుంబ పోషణ భారమైంది.
దీంతో వ్యవసాయ కూలి పనికి వెళ్లి ఇద్దరు కూతుళ్ళను పోషిస్తుంది. ఇంట్లో మగదిక్కు లేకపోవడంతో తనను అడిగేవారు ఎవరుంటారులే అనుకున్న ఆర్ ఎంపీ డాక్టర్.. తరచూ బాలికను క్లినిక్ కు పిలిపించునే వాడని ఈ విషయం తెలిసిన గ్రామస్థులు గతంలో కూడా వైద్యుడిని మందలించినట్లు తెలిపారు. శుక్రవారం బాలిక 3గంటలు పాటు క్లినిక్ లోనే ఉండడం గమనించిన స్థానికులు వైద్యుడికి దేహశుద్ది చేశారు. ఎప్పటిలాగానే బాలిక స్కూల్ కు వెలిందనుకున్న తల్లికి విషయం తెలియడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. తమ కూతురును మోసం చేసి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.