తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా

by Javid Pasha |
తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా
X

దిశ, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్‌ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో బస్సులో 45 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాద ఘటనపై ఈవో ధర్మారెడ్డి విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ ఎండీతో పాటు ఎలక్ట్రిక్‌ బస్సులు సరఫరా చేస్తున్న ఒలేక్ట్రా కంపెనీ ప్రతినిధులతోనూ ఈవో మాట్లాడారు. ప్రస్తుతం తితిదే వద్ద 10, ఆర్టీసీ వద్ద 65 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉన్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story