కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు.. పరిస్థితి విషమం

by Kalyani |
కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు.. పరిస్థితి విషమం
X

దిశ, పరిగి: నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిపై వీధి కుక్క దాడి చేయగా వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉంది.వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన గండు సాయమ్మ (85) ను గ్రామానికి చెందిన వీధి కుక్క ఆదివారం దాడి చేసింది. గండు సాయమ్మ ముఖంపై కుక్క కరవగా ముక్కు పై పెదవు, నోరు మాంసం పీక్కతింది.

అలాగే కాళ్లు చేతులపై కూడా తీవ్రంగా దాడి చేసింది. వెంటనే గాయపడిన గండు సాయమ్మను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఉస్మానియాస్వతికి తరలించారు.

Advertisement

Next Story