మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |   ( Updated:2024-09-28 10:39:14.0  )
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,కేశంపేట : మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మామిడిపల్లి నరసింహ (35) గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసై తాగడానికి ఇతరుల వద్ద డబ్బులు తీసుకునే వాడు.

ఈ విషయంలో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈనెల 16వ తేదీన కూడా భార్యాభర్తలు గొడవపడి భార్య వాళ్ల చిన్నమ్మ ఊరైన గంగన్నగూడెం వెళ్లిపోయింది. దీంతో నరసింహ శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశంపేట ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story