- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమానుషం…ఆస్తికోసం తండ్రినే హతమార్చిన తనయుడు
దిశ, సుల్తానాబాద్ : ఆస్తికోసం కన్న తండ్రిని కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. బ్యాటుతో బలంగా తలపై కొట్టగా అక్కడికక్కడే తండ్రి ప్రాణాలు కోల్పోయిన అమానుష ఘటన సుల్తానాబాద్ పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన తోట్ల మధునయ్య (71) అనే వ్యక్తి తన కుమారుడు తోట్ల తిరుపతి యాదవ్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
భూమికోసంకొంత కాలంగా కుటుంబ కలహాలు జరుగుతుండగా వారసత్వంగా వచ్చిన భూమిని కూతుళ్లకు సైతం ఇస్తానని తండ్రి చెప్పడంతో అది నచ్చని కుమారుడు తిరుపతి విచక్షణారహితంగా బ్యాట్ తో తండ్రి తలపై బలంగా కొట్టగా మధునయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మధునయ్య మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మధునయ్య భార్య మధునమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.