CBI Court: అత్యాచారం కేసు‌ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.. సీల్దా కోర్టు సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:20 Jan 2025 9:13 AM  )
CBI Court: అత్యాచారం కేసు‌ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.. సీల్దా కోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా (Kolkata)లోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు విచారణలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేసులో కీలక నిందితుడిగా సంజయ్ రాయ్‌ (Sanjay Roy)ని సీబీఐ స్పెషల్ కోర్టు (CBI Special Court) నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ అతడికి ఉరి శిక్షను ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపిస్ట్ సంజయ్ రాయ్‌కి ఉరి శిక్ష విధించాలని కోర్టును సీబీఐ కోరింది. బాధితురాలు ఓ మెరిట్ స్టూడెంట్ అని.. సమాజానికి ఆమె ఒక ఆస్తి అని తమ వాదనలు బలంగా వినిపించింది. అత్యాచారం ఘటన సభ్యసమాజానికి దిగ్భ్రాంతిని కలిగించిందని కోర్టుకు విన్నవించింది. అందుకే ఈ కేసులో సంజయ్ రాయ్‌కి ఉరి శిక్ష విధించాలని సీబీఐ కోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చేసింది మామూలు నేరం కాదని ఆక్షేపించింది. మహిళా వైద్యురాలిని నిర్ధయగా హత్య చేశారని కోర్టు కామెంట్ చేసింది. కాగా, కేసులో తుది తీర్పును కోర్టు మధ్యాహ్నం 2.45కి వాయిదా వేసింది.

Next Story

Most Viewed