యువకుడిపై యాసిడ్ దాడి

by Shiva |
యువకుడిపై యాసిడ్ దాడి
X

దిశ, నారాయణఖేడ్: ఓ యువకుడిపై మరో యువకుడు యాసిడ్ తో దాడి చేసిన ఘటన నారాయణ ఖేడ్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పంచగామ కమాన్ వద్ద గర జెర్సీ డైరీలో అజయ్, దత్తు అనే ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. వారిద్దరి మధ్య చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పరస్పరం ఒకరిపైన మరొకరు దాడి చేసుకున్నారు.

దీంతో సహనం కోల్పోయిన దత్తు పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను అజయ్ పై పోశాడు. దీంతో గమనించిన స్థానికులు అతడిని వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు అజయ్ ని హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున విచారణ ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed