హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

by Sridhar Babu |
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
X

దిశ, జగిత్యాల టౌన్ : హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లపాటి రాజేశ్వర్, పల్లె పోశెట్టి కి మధ్యలో పాత కక్షలు ఉండేవి. ఈ నేపథ్యంలో పల్లె పోశెట్టి బార్లపాటి రాజేశ్వర్ ను హత్య చేయగా కేసును విచారించిన న్యాయమూర్తి నీలిమ నిందితునికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో పీపీగా మల్లికార్జున్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ శ్రీను, ఎస్ఐ వెంకట్రావు, కోర్ట్ కానిస్టేబుల్ రంజిత్, లైజనింగ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ నిందితునికి శిక్ష పడడంలో కోర్టుకు సాక్ష్యాధారాలు అందించడంలో ముఖ్యపాత్ర వహించారు. వీరిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.

Advertisement

Next Story