Nude Video calls : న్యూడ్ కాల్‌‌తో వలపుల వల.. సీన్ కట్ చేస్తే..

by Satheesh |   ( Updated:2023-02-17 09:38:38.0  )
Nude Video calls : న్యూడ్ కాల్‌‌తో వలపుల వల.. సీన్ కట్ చేస్తే..
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: సైబర్ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా అవతలి వారిని ఉచ్చు లోకి లాగి లక్షలు కొల్లాగొడుతున్నారు. తాజాగా ఓ ఫార్మా కంపెనీని ఇదేవిధంగా మోసం చేశారు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధులను ఆన్ లైన్ ద్వారా సంప్రదించారు. తమను తాము ఆర్మీ అధికారులమని పరిచయం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో స్కానింగ్ మిషన్లు కావాలని చెప్పారు.

అయితే, ఆర్మీ రూల్స్ ప్రకారం ముందుగా కొంత డబ్బు డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. పెద్ద ఆర్డర్ అని కంపెనీ వాళ్లు దీనికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో మోసగాళ్లు దఫాదఫాలుగా తాము చెప్పిన అకౌంట్లలోకి 25 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఆ తర్వాత డబ్బు తమకు చేరలేదని మళ్ళీ పంపామన్నారు. దాంతో అనుమానం వచ్చి ఫార్మా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బ్లాక్ మెయిల్..

ప్రభుత్వ ఉద్యోగిని వల లోకి లాగి 5 లక్షలు కొట్టేసింది ఓ కిలాడీ లేడీ. సోషల్ మీడియా ద్వారా సదరు ఉద్యోగితో పరిచయం పెంచుకున్న ఓ యువతి న్యూడ్ వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఉద్యోగిని కూడా అలాగే చెయ్యమంది. ముందు వెనక ఆలోచించకుండా సదరు ఉద్యోగి న్యూడ్ కాల్ చెయ్యగా ఆ యువతి దానిని రికార్డు చేసింది. అనంతరం దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి రూ.5 లక్షలు వసూలు చేసింది. మరింత డబ్బు కోసం వేధిస్తుండటంతో బాధితుడు శుక్రవారం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed