భవనం మీద నుంచి దూకి యువతి ఆత్మహత్య

by Sridhar Babu |
భవనం మీద నుంచి దూకి యువతి ఆత్మహత్య
X

దిశ,ఉప్పల్ : భవనం మీద నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం తుకారాంగేట్ కు చెందిన పిన్నపాటి రమేష్ కు (64) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహం కాగా చిన్న కూతురు పిన్నపాటి హరిత(24) సంవత్సరం నుంచి ఉప్పల్ అబ్కాస్ ఐటీ పార్క్ బిల్డింగ్ లో సీఎస్ టెక్నాలజీ కంపెనీలో కస్టమర్ రిలేషన్​ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం చేస్తుంది. హరిత ప్రతిరోజూ సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీ కి వెళ్లి తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంటికి వస్తుంది.

ప్రతిరోజులాగే మంగళవారం కూడా ఆఫీస్ కి వెళ్లింది. తెల్లవారుజామున మృతురాలి తండ్రికి హరిత పనిచేస్తున్న ఆఫీస్ నుంచి టీం లీడర్ ఫోన్ చేసి మీ కూతురు ఆఫీస్ భవనం నుంచి పడిపోయిందని తెలిపాడు. వెంటనే ఆమెని రామంతపూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చూసి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed