గుర్రపు భగ్గీని ఢీ కొట్టి యువకుడు మృతి

by Sumithra |
గుర్రపు భగ్గీని ఢీ కొట్టి యువకుడు మృతి
X

దిశ, రాజేంద్రనగర్ : ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు గుర్రపు భగ్గీని ఢీ కొని మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతల్ మెట్ ప్రాంతానికి చెందిన జమీల్ (38) గురువారం మధ్యాహ్నం తన స్నేహితుణ్ణి కలిసి ఇంటికి ద్విచక్ర వాహనం పై తిరుగు ప్రయాణమయ్యాడు. చింటల్ మెట్ ప్రాంతానికి చేరుకుంటున్న తరుణంలో వాహన వేగాన్ని నియంత్రించ లేక రోడ్డు పక్కన నిలిపి ఉన్న గుర్రపు భగ్గీని బలంగా ఢీ కొన్నాడు. జామీల్ శిరస్త్రాణం ధరించక పోవడంతో తలతో పాటు ఛాతీలో బలమైన గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు. జమిల్ సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story