జంతు కళేబరాలు కాదు.. రైలు ప్రమాదం మృతదేహాలు (వీడియో)

by Javid Pasha |   ( Updated:2023-06-08 12:17:22.0  )
జంతు కళేబరాలు కాదు.. రైలు ప్రమాదం మృతదేహాలు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల కొద్దీ ప్రయాణికులు చనిపోయారు. దాదాపు 1000 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే బోగీలను తొలగించే కొద్దీ వందల కొద్దీ మృతదేహాలు బయటపడ్డాయి. అయితే పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించే క్రమంలో కొంతమంది యువకులు ఆ మృతదేహాలను జంతు కళేబరాల లాగా వ్యాన్ లో విసిరేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చనిపోయిన వ్యక్తుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed