పదేళ్ల బాలుడి పై వీధి కుక్కల దాడి..

by Sumithra |   ( Updated:2023-05-12 09:16:28.0  )
పదేళ్ల బాలుడి పై వీధి కుక్కల దాడి..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పదేళ్ల బాలుడిపై నాలుగు వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటనలో బాలుడు గాయపడిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించడంతో వీధికుక్కలు పరారయ్యాయి. ఎర్రగడ్డ కాలనీకి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు సిద్దు తమస్వంత మిల్క్ సెంటర్ నుండి ఇంటికి వెళుతుండగా నాలుగు కుక్కలు బాలుడి పై ఒక్కసారిగా దాడికి దిగాయి.

వెంటనే స్థానికులు రావడంతో కుక్కలు పరారయ్యాయి. ఈ ఘటనలో బాలుడి కాళ్లు, పిక్కలకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కుక్కలు, పందుల బెడద రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.

Also Read.

కుప్పంలో తీవ్ర విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన తమిళ ఏనుగులు

Advertisement

Next Story