నిజాం సాగర్ కెనాల్ లో ఆర్మూర్ వాసి మృతి..

by Sumithra |   ( Updated:2023-06-21 15:33:41.0  )
నిజాం సాగర్ కెనాల్ లో ఆర్మూర్ వాసి మృతి..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ లోని రాజారాం నగర్ కాలనీకి చెందిన అమీర్ బీన్ మహమ్మద్ మహమ్మద్ (35) ప్రక్కన గల నిజం సాగర్ కెనాల్లో బుధవారం మృతి చెందారు. రాజారాం నగర్ లోని నిజాంసాగర్ కెనాల్ కల్వర్టు కింద కుళ్ళిపోయిన స్థితిలో మృతుని శవం లభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడికి పెళ్లి అయి విడాకులు అయినప్పటి నుండి తాను మానసికంగా బాధపడుతూ బిక్షాటన చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా అక్కడ ఇక్కడ పడుకునేవాడని తెలిపారు.

అలా ఆహారం సరిగా లేక తన ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్లుగా మృతుని బంధువులు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్హెచ్ఓ సురేష్ బాబు, ఎస్సై రాము తెలిపారు.


Advertisement

Next Story

Most Viewed