సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బీభత్సం

by GSrikanth |   ( Updated:2022-08-18 07:28:13.0  )
సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు దగ్గర లారీని వెనుకనుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కొందరు స్థానికులు క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed