- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండు గర్భిణిని నిర్బంధించి భర్త కిడ్నాప్
దిశ, అమలాపురం: ఫైనాన్షియర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పరిస్థితి ఏదైనా ఎలా ఉన్న వాళ్లకు కావాల్సింది డబ్బు. అవసరమైతే కిడ్నాప్ లు. ఇలాంటి సంఘటనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో మంగళవారం జరిగింది. ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామానికి చెందిన లంకలపల్లి రవీంద్ర , శిరీష దంపతులు అమలాపురం ముస్లిం వీధిలో నివాసం ఉంటున్నారు. స్కూటీ కొనేందుకు అమలాపురంలోని పద్మ పూజిత ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్స్ తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా రెండు నెలలుగా వాయిదాలు కట్టలేకపోయారు. అయితే కొంతకాలం గడువు కావాలని కట్టేస్తామంటూ వారు ఫైనాన్షిర్లను గడువు కోరారు. అయితే వారు కచ్చితంగా వాయిదాలు కట్టాల్సిందేనని మంగళవారం ఉదయం 8 గంటలకు ముస్లిం వీధిలో ఉంటున్న రవీంద్ర ఇంటికి వెళ్లి భార్యాభర్తల లోపల ఉండగానే బయట గడియవేసి తాళం వేసి నిర్బంధించారు.
అనంతరం డబ్బు కడితేనే నీ భర్తను వదులుతామని రవీంద్రను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్య ఎంత బతిమాలినా ప్రాధేయపడినప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా దౌర్జన్యం చేసి తమ భర్తను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని ఆమె వాపోయింది. గంట తర్వాత ఒక ఏజెంట్ వచ్చి తన చేత ఏదో కాగితంపై సంతకాలు పెడితేనే నీ భర్తను వదులుతామని సంతకాలు పెట్టించుకున్నారని వాపోయింది. ఆ తర్వాత పద్మ పూజిత ఫైనాన్స్ కు వెళ్లి డబ్బులు కట్టేస్తామని తన భర్తను విడిచిపెట్టాలని ఆమె ఎంత ప్రాధేయపడిన వారు పట్టించుకోలేదు. అలాగే డబ్బు కూడా కట్టేస్తాం తన భర్తను వదిలేయలని బ్రతిమాలినా ఫైనాన్సర్లు రవీంద్రను విడిచిపెట్టలేదని శిరీష కన్నీరు మున్నీరుగా విలపించింది. దీంతో ఆమె అమలాపురం పట్టణం పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను కిడ్నాప్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. సంఘటన తెలిసిన వెంటనే పీడీఎస్ ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు, నల్లమిల్లి ఉపసర్పంచ్ విప్పర్తి రమణ, శిరీష బంధువులు పోలీస్ స్టేషకు వెళ్లి ఫైనాన్సర్ల ఆగడాల అరికట్టాలని బాధితులకు న్యాయం చేసి రవీంద్రను విడిచి పెట్టాలని పోలీసులను కోరారు.