- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..

దిశ, కోరుట్ల టౌన్ : కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట కాలనిలో ఇప్ప సుమన్ (32) అనే వ్యక్తి అనుమాన స్పదంగా మృతి చెందాడు. మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్, కోరుట్ల ఎస్సై కిరణ్ లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుని భార్య గంగాజల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు తెలిపారు.
పూర్తివివరాల్లోకెళితే కోరుట్ల పట్టణానికి చెందిన ఇప్పసుమన్ బుధవారం సాయంత్రం అదే కాలనిలో జరిగిన శుభకార్యానికి హాజరైనట్లు మృతుని భార్య తెలిపారు. అదేరోజు రాత్రి శుభకార్యంలో జరిగిన గొడవలో గాయపడి సుమన్ మృతి చెందినట్లు మృతిని భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. మృతుడు అదే కాలనీలో కొందరు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నట్లు, తీసుకున్న అప్పు చెలించనందుకే హత్య చేసి ఉంటారని సుమన్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.