డివైడర్ ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి..

by Sumithra |
డివైడర్ ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి..
X

దిశ, మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలం పరిధిలోని బాధలాపురం గ్రామపరిధిలో జరిగింది. రూరల్ ఎస్సై దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ కి చెందిన మహేష్ కుమార్ (26) యాద్గార్ పల్లి గ్రామ పరిధిలో ఉన్న లక్ష్మి ప్రసన్న రైస్ మిల్లులో రెండేళ్లుగా హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు.

శుక్రవారం తోటి కార్మికుడు బినోద్ కుమార్ తో కలిసి నిత్యవసర సరుకులు కోనేందుకు బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ డివైడర్ ని ఢీ కొట్టగా మహేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన బినోద్ కుమార్ ని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు మహేష్ కుమార్ కి ఏడాది క్రితమే వివాహం అయిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Next Story