రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Shiva |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, జుక్కల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన జుక్కల్ మండల పరిధిలోని ఖండేబాలూర్ బాలాజీ నగర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర తాలూకా మార్తోలి గ్రామానికి చెందిన దాదారావు పటేల్ (45) దేగ్లూర్ నుంచి ఖండేబాల్లూర్ తన అత్తగారింటికి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో జుక్కల్ మండలం ఖండేబాలూర్, బాలాజీ నగర్ వద్దకు రాగానే రోడ్డుపై ఉన్న వరి ధాన్యం కుప్పను తప్పించబోయి దాదారావు పటేల్ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదేవిధంగా ఘటనకు సంబంధించి వీడయో సీసీ కెమెరాలో రికార్డైంది. బైక్ పై ఉన్న వ్యక్తి చనిపోయాడని గ్రహించిన లారీ డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా టోల్ గేట్ సిబ్బంది వెంబడించి అతడిని అదపులోకి తీసుకుని జుక్కల్ ఎస్సై మురళికి అప్పగించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story