రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Shiva |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, గాంధారి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన గాంధారి మండల కేంద్రంలోని మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం కేంద్రానికి చెందిన మద్దెల సాయికుమార్, పాండురంగారెడ్డి ఇద్దరు కలిసి బ్రహ్మజివాడి బైక్ పై బయలుదేరారు. ఈ క్రమంలో బూర్గుల్ క్రాస్ రోడ్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టాటా గూడ్స్ బండి తప్పించబోయి సడెన్ బ్రేక్ వేయగా బైక్ ఒక్కసారిగా స్కిడ్ అయి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో మద్దెల సాయికుమార్ తలకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. అదేవిధంగా పాండురంగారెడ్డికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. మృతుడి తండ్రి మద్దెల సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు.

Advertisement

Next Story