రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Shiva |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, తిమ్మాపూర్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయలయ్యాయి. పోలీసులు కథనం ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన పాశం సురేష్, తడిగొప్పుల ప్రశాంత్, దుంబాల చందులు కలిసి ట్రాలీ ఆటోలో టెంట్ హౌస్ పని నిమిత్తం కరీంనగర్ కు మంగళవారం రాత్రి వెళ్లి తిరిగి మల్లాపూర్ కు తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో తిమ్మాపూర్ లోని ఇండియన్ పెట్రోల్ బంకు ఎదురుగా కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఆటో ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీ ఆటోలో డ్రైవర్ పక్కనే కూర్చున్న పాశం సురేష్ తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో సురేష్ ప్రాణాలు వదిలాడు. అదేవిధంగా ఆటోలో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పాశం శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్.ఎం.డీ.ఎస్ ఐఎస్ ప్రమోద్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story