ఘట్కేసర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్

by Javid Pasha |
ఘట్కేసర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఘట్కేసర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్. ఇంతకుముందు అవినాష్ రెడ్డితో ప్రేమాయణం నడిపిన మహిళ అతనిపై మేడిపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాము సన్నిహితంగా ఉన్న సమయంలో సెల్ఫీ ఫోటోలను అవినాష్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు అందులో పేర్కొంది. అవినాష్ రెడ్డితో గతంలో సన్నిహితంగా ఉన్న సదరు మహిళ ఇటీవల అతని నుంచి విడిపోయింది. బీజేపీ నేత చక్రధర్ గౌడ్ కు దగ్గరయ్యింది. దాంతో గతంలో తాను ఇచ్చిన డబ్బు వాపసు చెయ్యాలని అవినాష్ రెడ్డి ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.

దీంట్లో జోక్యం చేసుకున్న చక్రధర్ గౌడ్ ఆదివారం అవినాష్ రెడ్డిని కిడ్నాప్ చెయ్యటానికి యత్నించాడు. ఈ మేరకు చక్రధర్ గౌడ్ పై కేసులు నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో సదరు మహిళ సోమవారం అవినాష్ రెడ్డిపై ఫిర్యాదు చెయ్యటం గమనార్హం. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

Advertisement

Next Story