గుర్తుతెలియని వాహనం ఢీకొని వివాహిత మృతి

by Sumithra |   ( Updated:2022-10-17 14:38:49.0  )
గుర్తుతెలియని వాహనం ఢీకొని వివాహిత మృతి
X

దిశ, పిట్లం : పిట్లం మండలంలోని రాంపూర్ కుర్తి రహదారిపై గుర్తుతెలియని వాహనం వివాహితను ఢీ కొనడంతో మహిళ మృతి చెందినట్లు ఏఎస్సై లింబాద్రి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళ్తే గూల సాయవ్వ (50) రాంపూర్ లో నివాసం ఉన్నట్లు ఆయన తెలిపారు. భర్తతో విడిపోయి ఆమె తన తల్లి స్వగ్రామం రాంపూర్ గ్రామంలో నివాసం ఉంటుందని, ఆమెకు పిల్లలు లేరని తెలిపారు. సాయవ్వ తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

Next Story

Most Viewed