అమెరికాలో గన్‌ఫైర్ ఆపమన్నందుకు.. 8 ఏళ్ల చిన్నారి సహా నలుగురిని కాల్చి చంపిన వ్యక్తి

by Mahesh |   ( Updated:2023-04-30 02:11:02.0  )
అమెరికాలో గన్‌ఫైర్ ఆపమన్నందుకు.. 8 ఏళ్ల చిన్నారి సహా నలుగురిని కాల్చి చంపిన వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటి ముందు AR-15 ఆయుధంతో కాల్చడం ఆపమని ఇంటి పక్కన వారు కోరారు. దీంతో ఆ వ్యక్తి కోపంలో 8 ఏళ్ల చిన్నారి సహా.. మొత్తం ఐదుగురు వ్యక్తులను దారుణంగా కాల్చి చంపాడు. దుండగుడు మృతుల శరీరంపై మెడ నుంచి కాళ్ల వరకు విచక్షణా రహితంగా కాల్చి చంపినట్లు అక్కడ అధికారి శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ గ్రెగ్ కేపర్స్ చెప్పారు. కాగా కాల్పుల అనంతరం దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Advertisement

Next Story