- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య
దిశ, కొల్లాపూర్/చిన్నంబావి: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్ద దగడకు చెందిన తిరుపతి (32) అనే వ్యక్తి తమకు బంధువు అయిన చుక్కాయిపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆ మహిళ భర్తతోపాటు కుటుంబ సభ్యులు సైతం తిరుపతిని పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది. ఇదే విషయమై చిన్నంబావి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది.
మహిళ భర్త ఇంట్లో లేడు అన్న విషయం తెలుసుకొని తిరుపతి శనివారం అర్ధరాత్రి తర్వాత చుక్కాయిపల్లి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన మహిళ భర్త నిరంజన్ ఇరువురు ఏకాంతంగా ఉండడాన్ని గుర్తించి ఆగ్రహంతో తిరుపతి గొంతు కోసి హతమార్చాడు. నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుని భార్య సంతోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్లాపూర్ సీఐ యాలాద్రి, ఎస్సై బాల వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.