- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. ఆ పని చేయొద్దనందుకు భార్యను కరెంట్ షాక్ పెట్టి హత్య చేసిన భర్త
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో దారుణం జరిగింది. నిద్రలో ఉన్న భార్యను ఆమె భర్త కరెంట్ షాక్ పెట్టి హత్య చేశాడు. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన యాదయ్య, కవిత భార్యభర్తలు. కాగా, ఇటీవల యాదయ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం తాగవద్దని భార్య కవిత భర్తకు చెప్పింది.
ఆగ్రహానికి గురైన యాదయ్య.. తన భార్య కవితను నిద్రిస్తుండగా కరెంట్ షాక్ పెట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, పది సంవత్సరాలు క్రితం కవిత, యాదయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే హత్య చేయడంతో కవిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement
Next Story