పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేసిండు

by Javid Pasha |
పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేసిండు
X

దిశ, వెబ్ డెస్క్: అభంశుభం తెలియని ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లేపుకెళ్లాడు. చివరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లా భీమ్ నగర్ కు చెందిన ఆష్ అనే వ్యక్తి నాలుగు నెలల కిందట జమ్మూకు వెళ్లాడు. అక్కడ మహినూర్ (16) అనే అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆ బాలిక ఆ యువకుడితో యూపీకి లేచిపోయింది.

అయితే మార్చి 22న పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆ యువకుడు బాలికను గొంతు నులిమి చెంపేశాడు. అనంతరం సూసైడ్ చేసుకుందని బాలిక తండ్రి తాలిబ్ అలీకి సమాచారం అందించాడు. అయితే గొంతునులిమి చంపడం వల్లే బాలిక మృతి చెందినట్లు బాలిక పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story