crime news : మద్యం మత్తులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి..

by Sumithra |
crime news : మద్యం మత్తులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి..
X

దిశ, పెద్దశంకరంపేట : మద్యం మత్తులో ఈతకు వెళ్లి యువకుడి మృతి చెందిన ఘటన పెద్ద శంకరంపేటలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం పేటకు చెందిన నాందేడ్ సునీల్ (31) అతని స్నేహితుడితో కలిసి మంగళవారం కమలాపూర్ చెరువు కట్ట పై మద్యం సేవించారు. సాయంత్రం ఇంటికి వెళుతున్న క్రమంలో ఇద్దరు చెరువులో ఈత కోసమని దిగారు. ఈ క్రమంలోనే సునీల్ కు ఊపిరాడక నీట మునిగి మృతి చెందాడు. అతని స్నేహితుడు వెంటనే బయటికి వచ్చి కుటుంబీకులకు సమాచారం అందించాడు. బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో సునీల్ మృతదేహాన్ని వెలికి తీశారు. స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story