తప్పిన పెను ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన పిల్లల ఆటో

by Sridhar Babu |
తప్పిన పెను ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన పిల్లల ఆటో
X

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ ఆటో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ నుండి పెద్దపల్లికి వెళ్తున్న పిల్లల ఆటో సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల రాజీవ్ రహదారిపై రోడ్డు పక్కక ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.

దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో సాయి చందర్, అభిరామ్, ఆదిత్య, విశాల్, వర్షిత్ ఉన్నారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed