crime news : కట్టుకున్న వాడే కాల యముడు..

by Sumithra |
crime news : కట్టుకున్న వాడే కాల యముడు..
X

దిశ, మల్లాపూర్ : ఏడడుగులతో ఒకటైన బంధం కడదాక నిల్వకుండా ఆమెకు కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెల్మల రమేష్ సునీత (26) దంపతులు వీరికి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం భార్యాభర్తలకు జరిగిన ఘర్షణలో భర్త రమేష్ భార్యను గోడకు కొట్టడంతో భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్య భార్య పై అనుమానంతోటే జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. రమేష్ పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed