లక్ష కడితే నాలుగు లక్షలు.. హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో భారీ మోసం

by Satheesh |   ( Updated:2023-02-15 11:05:33.0  )
లక్ష కడితే నాలుగు లక్షలు.. హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో భారీ మోసం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కూకట్‌పల్లిలో ఎక్స్‌సీఎస్‌పీఎల్ కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. తమ దగ్గర పెట్టుబడి పెడితే మూడు నెలల్లో 4 రెట్ల లాభం ఇస్తామంటూ మోసం చేసింది. రూ. లక్ష కడితే నాలుగు లక్షలు రూపాయలు ఇస్తామని బాధితులకు ఆశ చూపించింది. ఏకంగా 90 రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగు రేట్లు ఎక్కువగా ఇస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసింది. దీంతో, బాధితులు అప్పుచేసి, లోన్‌ తీసుకుని, క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బులు ఇన్వెస్ట్‌ చేశారు.

తీరా కంపెనీ వారికి డబ్బు చెల్లించకపోవడంతో అసలు మోసం బయట పడింది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, కేపీహెచ్‌బీలో మంజీరా మాల్‌లోని ఎక్స్‌సీఎస్‌పీఎల్ ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. కనీసం పెట్టుబడి కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు వస్తాయని అప్పులు తెచ్చి మరి పెట్టుబడి పెట్టామని బాధితులు వాపోతున్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed