- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరాంఘర్ చౌరస్తాలోని ఐరన్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం..
దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తాలో ఐరన్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఓ సిలిండర్ పేలిపోయి దూరంగా ఎగిరి పడింది. యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినప్పటికీ పరిసర ప్రాంతాల్లో ప్రజలు లేకపోవడంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. కాలం చెల్లిన వాహనాలను, ప్రమాదానికి గురైన వాహనాలను కొనుగోలు చేసి ఈ స్క్రాప్ గోదాంలో వాటి విడిభాగాలను వేరు చేస్తారు. వెల్డింగ్ మిషన్ ద్వారా వాహనాల విడిభాగాలను వేరు చేయడం జరుగుతుంది. ఎప్పటి మాదిరిగానే గురువారం మధ్యాహ్నం తర్వాత వెల్డింగ్ మిషన్ తో విడిభాగాలను వేరు చేస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
క్రమంగా మంటలు పెరిగి గోదాం అంతటా వ్యాపించడంతో గోదాంలో ఉన్న ఓ సిలిండర్ పేలిపోయి రోడ్డుపైన పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్క్రాప్ గోదాంలో మరిన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నప్పటికీ మంటలు ఆ వైపు వ్యాపించకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జనావాసాల మధ్యనే ఇలాంటి స్క్రాప్ గోదాములు ఏర్పాటు చేస్తూ పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా మేల్కొని జనావాసాల మధ్యన ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రమాదకరమైన గోదాములను తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజేంద్రనగర్ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లు, జీహెచ్ఎంసి డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు.