- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్ లైన్ లో గేమ్స్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
దిశ, ఖిలా వరంగల్: వరంగల్ ఓసీటీ కేంద్రంగా ఆన్ లైన్ లో గేమ్స్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు యువతులతో సహా మొత్తం ఆరుగురు ముఠా సభ్యులను మీల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు సుమారు రూ.10 లక్షల విలువ గల మూడు ల్యాప్ టాప్ లు, 13 సెల్ ఫోన్ లు, రూ. లక్ష 90 వేలు నగదు, ఓ ద్విచక్ర వాహనం, వివిధ బ్యాంకులకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ వివరాలను వెళ్లడించారు.
ఛత్తీస్ ఘడ్, రాయచూర్ ప్రాంతానికి చెందిన పఠాన్ నాబ (23), పటాన్ ఖాసీం ఖాన్ (28), ఒడిషాకు చెందిన చాందిన నాగ్ (27)తో పాటు సయ్యద్ సల్మాబేగ్ (26), ఖమ్మంకు చెందిన మొగల్ మున్న (19), గుంజ కళ్యాన్ (20) లు ఓ ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. అందులో భాగంగానే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ఎంపిక చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా బెట్టింగ్ లో పాల్గొనే వారు ముందుగా ఈ ముఠా సూచించిన ఆన్ లైన్ లో కొంత మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డబ్బును డిపాజిట్ చేసిన వ్యక్తులకు ఈ బెట్టింగ్ నిర్వహకులు యూజర్ నేమ్, పాస్వర్డు ను అందజేస్తారు. దీని ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుంది.కొద్ది రోజుల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావడంతో ఈ బెట్టింగ్ ముఠా ఐపీఎల్ క్రికెట్ జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తోంది.
బెట్టింగ్ లో గెలిచిన వారికి రెండింతలు డబ్బును అందజేసేవారు. ఈ ముఠా గతంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కూడా బెట్టింగ్ నిర్వహించింది. ఓసీటీ కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మీల్స్ కాలనీ పోలీసులు బుధవారం సాయంత్రం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి నుంచి పోలీసులు ల్యాప్ టాప్ లు, డబ్బులు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, మిల్స్ కాలనీ, సైబర్ క్రైమ్స్ ఇన్ స్పెక్టర్లు ముస్కా శ్రీనివాస్, జనార్ధన్ రెడ్డి, సైబర్ క్రైం ఏఏఓ ప్రశాంత్ ఎస్ఐ కుమార్, ఏఎస్ఐ స్వరూప, కానిస్టేబుళ్లు భౌసింగ్ లను డీసీపీ నాగేశ్వర్ రావు అభినందించారు.