రూమ్‌మేట్‌ నోట్లో రాళ్లు పెట్టి చంపిన స్నేహితుడు.. ఎందుకంటే?

by Hamsa |
రూమ్‌మేట్‌ నోట్లో రాళ్లు పెట్టి చంపిన స్నేహితుడు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే కోపంతో ఊగిపోతూ క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటలను రోజురోజుకు చాలానే పెరిగిపోతున్నాయి. తాజాగా, ఫ్లోరిడాలో ఓ యువకుడు తన రూమ్‌మెట్‌ అన్నం విసిరికొట్టాడని అతడిని చంపేశాడు.

వివరాలు ప్రకారం.. ఫ్లోరిడాలో బ్రయాన్ (22) అనే యువకుడు తన స్పేహితుడు మార్క్వెజ్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే ఒకరోజు రాత్రి అన్నం తింటుండగా అతడి రూమ్‌మెట్ అన్నాన్ని నేలపై విసిరికొట్టాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న బ్రయాన్ ఒక రోజు మద్యం తాగి రూమ్‌‌మెట్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత అతడిని కింద పడేసి అతడి నోట్లో మట్టి, కంకర రాళ్లను కుక్కి చంపేశాడు.

వెంటనే మార్క్వెజ్ మృతిదేహాన్ని పెరట్లో గుంత తవ్వి అందులో పాతిపెట్టాడు. ఈ విషయం గురించి ఓవ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బ్రయాన్‌ను గట్టిగా విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. దీంతో మృతదేహాన్ని గుంతలో నుండి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించి నిందితుడు బ్రయాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story