- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైలార్దేవుపల్లిలో గోనెసంచిలో మృతదేహం కలకలం
దిశ,శంషాబాద్ : జీహెచ్ఎంసీ కార్మికులు రోడ్లు శుభ్రం చేస్తుండగా రోడ్డు పక్కన గోనెసంచిలో మృతదేహాన్ని గుర్తించిన ఘటన మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్ వద్ద జిహెచ్ఎంసి కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తుండగా రోడ్డు పక్కనే సంచిలో నుండి దుర్వాసన రావడంతో దాన్ని చూడగా అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు 100 నెంబర్ కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అందులో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు గుర్తించి డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు. గోనెసంచిలో ఉన్న మృతదేహం 30 సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని యువకునిగా పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. ఎక్కడో హత్య చేసి ఆ మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి ఇక్కడ వదిలేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.