Crime News: వీడియో కాల్‌లో భార్యను చూపించలేదని సహోద్యోగిపై కత్తెరతో దాడి

by Hamsa |   ( Updated:2023-02-01 04:47:23.0  )
Crime News: వీడియో కాల్‌లో భార్యను చూపించలేదని సహోద్యోగిపై కత్తెరతో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజధాని బెంగుళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. వీడియో కాల్‌లో భార్యను చూపించలేదన్న కోపంతో ఓ వ్యక్తి సహోద్యోగిపై కత్తెరతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హెచ్‌ఎస్ఆర్ లేఅవుట్‌లో నివాసిస్తున్న సురేష్ వర్మ, వెంకట్ పురలో ఉండే రాజేష్ మిశ్రాలు ఓ బట్టల షాపులో పని చేస్తున్నారు. మంగళవారం రాజేష్ మిశ్రా తన భార్యతో వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో సురేష్ వచ్చి అతడి భార్యను చూపించమని అడిగాడు. దానికి రాజేష్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో సురేష్‌, మిశ్రాను కత్తెరతో పొడిచాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. అది గమనించిన సహోద్యోగులు అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకుని విచారిస్తున్నారు.

Read more:

మైనర్ బాలికపై మేనమామ అత్యాచారయత్నం.. నోట్లో యాసిడ్ పోయడంతో

Advertisement

Next Story