వివాహితను కలిసేందుకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు.. అది కోసేసిన అత్తింటి వారు

by sudharani |
వివాహితను కలిసేందుకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు.. అది కోసేసిన అత్తింటి వారు
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలతో జీవితాలు నాశనమవడంతో పాటు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశంలో తరచు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నప్పటికీ మార్పు చెందక మరింత తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. పెళ్లైన మహిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను కలిసేందుకు అర్ధరాత్రి వెళ్లాడు. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ అత్తింటి వారు ఆ వ్యక్తి నాలుకను కోసి అక్కడ నుంచి పంపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఝార్ఖండ్ సరిహద్దుల్లోని గఢ్వా ప్రాంతంలో ఓ వివాహిత తన కుటుంబంతో నివాసం ఉంటుంది. అయితే సోన్‌భద్ర జిల్లా పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు హరియాణాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మేరకు యువకుడికి వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ యువకుడు వివాహితను తీసుకెళ్లిపోయి హరియాణాలో ఓ గది అద్దెకు తీసుకుని ఇద్దరు అక్కడ ఉండసాగారు. కొద్ది రోజులు బాగానే సాగిన వీరి సహజీవనం.. వివాహిత అత్తింటి వారు కోడలు కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదుతో ముగిసింది. వివాహితను తీసుకెళ్లి భర్తకు అప్పజెప్పారు పోలీసులు. అయితే కొంత కాలం సైలెంట్‌గా ఉన్న మహిళ.. మళ్లీ ప్రియుడుని కలవడం మొదలు పెట్టింది.

ఈసారి ఏకంగా వివాహిత ఇంట్లోనే వీరి అక్రమ సంబంధం కొనసాగించారు. అయితే కొన్నాళ్లకు ఈ విషయం తెలుసుకున్న అత్తంటి వారు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రియురాలుని కలిసేందుకు వచ్చిన ప్రియుడుని పట్టుకుని ఓ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. అంతే కాకుండా.. ఒక పదునైన ఆయుధంతో అతడి నాలుకను సైతం కోసేసి ఆ వ్యక్తిని విడిచిపెట్టారు. అక్కడ నుంచి ఇంటికి చేరుకున్న యువకుడి నోటి నుంచి రక్తం రావడాన్ని గ్రహించిన కుటుంబసభ్యులు.. యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, ఆ వ్యక్తి నాలుక 2 నుంచి 3 అంగుళాల మేర కత్తిరించినట్లు తెలిపారు. అనంతరం నాలుకకు కుట్లు వేసి అతికించగలిగారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. కాగా.. ఈ ఘటనపై యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story