అక్క కొడుకును ప్రేమించిన 60 ఏళ్ల పిన్ని.. అతడిని దక్కించుకునేందుకు ఎంతకు దిగజారిందంటే..?

by sudharani |   ( Updated:2023-02-02 08:51:47.0  )
అక్క కొడుకును ప్రేమించిన 60 ఏళ్ల పిన్ని.. అతడిని దక్కించుకునేందుకు ఎంతకు దిగజారిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతుంది. అక్క, చెల్లి, అమ్మ అనే వరసలు మరిచి అత్యాచారాలు చేస్తున్న కొంతమంది మగాళ్ల గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాము. కానీ తన అక్క కొడుకునే ప్రేమించింది ఓ 60 ఏళ్ల పిన్ని. అతడిని దక్కించుకునేందరు నకిలీ పెళ్లి సర్టిఫికేట్‌ను కూడా సృష్టించింది. ఈ షాకింగ్ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మొహల్లా అంత గ్రామానికి చెందిన అసిఫ్ అనే వ్యక్తి స్థానికంగా బట్టలు షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అయితే అతడి చిన్నాన గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో అతడి పిన్ని కన్ను అసిఫ్‌పై పడింది. ఈ క్రమంలోనే అతడిని పెళ్లి చేసుకోమని వేధించేది. అసిఫ్ దానికి నిరాకరించడంతో.. పిన్ని తరుపు కుటుంబ సభ్యులు అసిఫ్ ఇంట్లోకి చొరబడి రచ్చ చేశారు. ఇదిలా ఉంటే అసిఫ్‌కు ఇటీవల పెళ్లి నిశ్చమయింది. ఆ పెళ్లికి 5 రోజుల ముందు అసిఫ్‌కు తనకు మ్యారేజ్ జరిగిందంటూ.. అతడి పిన్ని తప్పుడు మేరేజ్ సర్టిఫీకేట్స్‌ను సృష్టించి ఆడపెళ్లి వారికి పంపింది. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఇక ఆమె ప్రవర్తనకు విసుగు చెందిన అసిఫ్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. ఆ మ్యారేజ్ సర్టిఫీకేట్‌పై అసిఫ్ సంతకం లేదంటూ.. అతడి తరపు లాయర్ వాదిస్తున్నారు. అయితే ఈ కేసులో నిజనిజాలు ఇంకా తేలాల్సి ఉంది. కాగా.. అసిఫ్ పిన్ని వయసు 60 ఏళ్లు ఉన్నట్లు సమాచారం.

మానసిక ఒత్తిడిని దూరం చేసే ఆహారాలేవో తెలుసా !

Advertisement

Next Story