- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ లింక్ పై క్లిక్ చేశారు.. లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు
దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇంటర్ నెట్ వినియోగం బాగా పెరిగింది. ఇక సోషల్ మీడియా గురించి అయితే చెప్పనక్కరలేదు. ముఖ్యంగా వాట్సాప్, యూట్యూబ్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలోనే రకరకాల లింక్స్ మన వాట్సాప్ లో దర్శనమిస్తుంటాయి. యూజర్స్ వాటిపై క్లిక్ చేసి వీడియోలు, న్యూస్, ఇతర విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ అలా వచ్చే అన్ని లింక్స్ సేఫ్ అని అనుకుంటే పొరపాటే. కొన్ని లింక్స్ పై క్లిక్ చేస్తే క్షణాల్లో మన అకౌంట్లలో నుంచి డబ్బులు మాయమవుతుంటాయి. సైబర్ దొంగలు పంపే లింక్స్ ను ఓపెన్ చేసి చాలా మంది డబ్బును పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కు చెందిన దాదాపు 40 మంది కస్టమర్లకు ఓ లింక్ వచ్చింది. కేవైసీ (KYC), పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలంటూ వారందరికీ ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఇంకేముంది వాటిపై క్లిక్ చేసిన మూడు రోజుల్లో లక్షల కొద్దీ సదరు కస్టమర్లకు సంబంధించిన డబ్బు తమ అకౌంట్లలో నుంచి మాయమైంది.
దీంతో లబోదిబోమన్న బాధితులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో టీవీ నటి శ్వేతా మేమాన్ కూడా ఉన్నారు. బ్యాంక్ నుంచే మెసేజ్ వచ్చిందని లింక్ ఓపెన్ చేసి కస్టమర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ ఎంటర్ చేశానని పేర్కొంది. ఓ యువతి తనకు ఫోన్ చేసి తాను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పి ఓటీపీ తీసుకుందని చెప్పింది. ఓటీపీ చెప్పగానే అకౌంట్ లో నుంచి రూ.57,636 మాయమయ్యాయని వాపోయింది. ఇక మిగిలిన 39 మంది నుంచి కూడా సైబర్ దొంగలు ఈ విధంగానే డబ్బు కాజేశారు. ఎవరైనా ఆన్ లైన్ నుంచి కాల్ చేసి బ్యాంక్ డిటైల్స్, ఓటీపీ అడిగితే చెప్పవద్దని పోలీసులు, బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.