- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. నలుగురు డీఎస్పీలు సస్పెండ్

దిశ, వెబ్‌డెస్క్: పదో తరగతి పరీక్షలు(10th Class Exams) ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్ గ్రూపుల్లో క్వశ్చర్ పేపర్ వైరల్(Question Paper Leak) అయ్యింది. ఈ ఘటన హర్యానా(Haryana)లో చోటుచేసుకుంది. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు డీఎస్పీల సహా 25 మంది పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఐదుగురు ఇన్విజిలేటర్లను సైతం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రశ్నాపత్రం లీకైందన్న విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్ వద్దకు తండోపతండాలుగా చేరుకున్నారు. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆందోళనకు దిగారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థుల పేపర్లను అదుపులోకి తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు.
వెంటనే స్పందించిన అధికారులు.. తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమించేలా చేశారు. మరోవైపు హర్యానాలో ఈ సంవత్సరం 1,431 పరీక్షా కేంద్రాలలో 2,93,395 మంది విద్యార్థులు 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లీకైన మరుసటి రోజే టెన్త్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన పేపర్ కూడా లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.