- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
270 కేజీల నల్ల బెల్లం, 40 కేజీల పట్టిక స్వాధీనం
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో రాయచడి, చెన్నారం, అలాగే బల్మూరు మండలం మంగలికుంటపల్లి గ్రామాల వద్ద ఎక్సైజ్ శాఖ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా రూట్ మ్యాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం సీఐ మీడియాతో మాట్లాడుతూ.. రాయచడి చెన్నారం గ్రామాల మధ్య వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో నల్ల బెల్లం ఉన్నట్లు గుర్తించామని, వాటిని పరిశీలించగా తొమ్మిది బ్యాగులల్లో 270 కేజీల నల్ల బెల్లం ఉన్నదని, 40 కిలోల పట్టిక నాటు సారా ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే బల్మూరు మండలంలో ద్విచక్ర వాహనంపై దేవదారి కుంటకు చెందిన రాజు అనే వ్యక్తి ఎనిమిది లీటర్ల సారాను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.
ఈ క్రమంలో ఒకరు అరెస్ట్ కాగా మరొక వ్యక్తి అయ్యాడన్నారు. నల్ల బెల్లం సరఫరా చేయడం గాని నాటు సారా తయారు చేయడం చట్ట విరుద్ధమని పదేపదే ఆ వ్యక్తులు నాటుసారా నల్ల బెల్లం సరఫరా చేస్తూ పట్టుబడితే పిడి ఆక్ట్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నాటు సారా తాగి ప్రజలు తమ ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు కృష్ణయ్య, పరమేశ్వర్, ఎస్సైలు సతీష్ కుమార్, బాలరాజు సిబ్బంది రవి, రాఘవేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, బాల్య లు ఉన్నారు.