- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ 12 మంది మృతి..
దిశ, వెబ్‌డెస్క్: ఓడిశాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజా జిల్లాలోని దిగపహండి పోలీస్ స్టేషన్ పరిదితో ఆదివారం మధ్యరాత్రి రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న MKCG మెడికల్ కాలేజీకి తరలించినట్లు గంజాం జిల్లా మేజిస్ట్రేట్ దిబ్యా జ్యోతి పరిదా తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జ్యోతి తెలిపారు. బస్సు ప్రమాదంలో పది మంది మృతి చెందడం పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ₹ 3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దీనిపై సీఎం కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.