- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిపెద్ద స్కాం..81 UPI వినియోగదారుల నుంచి రూ.. కోటి చోరి
దిశ, వెబ్‌డెస్క్: కరోనా తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో సైబర్ నేరగాళ్లు కూడా భారీగా పెరిగిపోయారు. ముఖ్యంగా ఆన్ లైన్ నగదు బదిలీలకు UPI) యాప్‌లను ఉపయోగించి నగదు రహిత నగదు బదిలీలకు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ క్రమంలో మోసగాళ్లు కూడా ఇదే దారిని ఎంచుకుని అమాయకులనే కాకుండా చదువుకున్న వారిని సైతం మోసం చేసి డబ్బు కాజేస్తున్నారు.
ఈ తరహాలోనే ముంబైలోని 81 మంది మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని సుమారు కోటి రూపాయల వరకు పోగొట్టుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్కామర్లు.. Google Pay వంటి వారి UPI అప్లికేషన్‌లను ఉపయోగించి వ్యక్తులకు డబ్బు పంపుతున్నారు. తర్వాత పొరపాటుగా డబ్బులు వచ్చాయి.. తిరిగి వాటిని పంపండని వారికి కాల్ చేశారు. దీంతో పంపే ప్రయత్నం చేయగా వారి అకౌంట్లలో ఉన్న డబ్బులు మొత్తం మాయం అయ్యాయి. ఇలా దాదాపు 81 మంది మోసపోయారు. వీరంతా పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.